సిద్ధమైన సువర్ణసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్. తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ.. సువర్ణసుందరి చిత్రం సెన్సార్ కంప్లీట్ అయింది. యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. ఈనెల 31వ తేదీన తెలుగు, కన్నడలో విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్‌ను మించి క్వాలిటీ ఔట్‌పుట్ రావడం సినిమా సక్సెస్‌పై కాన్ఫిడెన్స్‌ను పెంచిందన్నారు. దర్శకుడు ఎం.ఎస్.ఎన్.సూర్య మాట్లాడుతూ.. సువర్ణసుందరి లాంటి కంటెంట్ ఉన్న సినిమాకు నేను డైరెక్టర్‌గా వర్క్‌చేయటం గర్వంగా ఉంది. స్టోరీ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీతో సినిమాను చేశాం. సెన్సార్ సభ్యులు మా సువర్ణసుందరిని చూసి టీమ్‌ను అభినందించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌వరకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే అన్నారు.