తప్పేముంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సంచలన హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ గుర్తుందిగా.. ఏంటి మరచిపోయేలా చేసిందా ఆ అమ్మాయి అంటారా? నిజమే నెగిటివ్ షేడ్స్‌లో నటించి గ్లామర్ షోతో షాకిచ్చిన పాయల్ రాజపుత్, ఈ పంజాబీ భామ ఇటీవలే సీత సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. తాజాగా వేశ్యల జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అసలు పాయల్ వేశ్యల జీవితాల గురించి ఎందుకు మాట్లాడింది అన్నది ఇప్పుడు ఆసక్తిరేపుతున్న ప్రశ్న? ప్రస్తుతం ఈ అమ్మడు ఆర్‌డిఎక్స్ లవ్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌కోసం పాపికొండలు వెళ్ళింది. అన్నట్టు ఈ సినిమాతోపాటు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తుంది. తాజాగా అక్కడ షూటింగ్ గ్యాప్‌లో ఓ విలేఖరి ఇంటర్వ్యూ చేసాడు. పంజాబీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా వేశ్య పాత్రలో నటించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అని అడిగిన ప్రశ్నకు అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. వేశ్య పాత్రలో నటించడం తప్పు ఎందుకు అవుతుంది. ఈ పాత్ర ఒప్పుకున్నాక వేశ్యల జీవితాల గురించి వారి లైఫ్ స్టయిల్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను.
వేశ్యలు కేవలం వాళ్ళు బ్రతకడానికి అలాంటి పనిని ఎంచుకున్నారని, దాన్ని ఆపేయమని చెప్పే హక్కు ఎవరికీ లేదని చెప్పింది. ఇక్కడ ఎవరి బ్రతుకు వాళ్లదే.. మీరు ఫలానా పని చేయండి అని ఎవ్వరికి నిబంధనలు పెట్టే హక్కు ఎవరికీ లేదు. అలాంటివి తనకు నచ్చవని చెప్పింది పాయల్. అనుష్క, టబు, రాణిముఖర్జీ, కరీనాకూర్ లాంటి ప్రముఖ నటీనమణులు వేశ్య పాత్రలు పోషించి నటీమణులుగా మంచి పేరుతెచ్చుకున్నారని, తాను కూడా ఈ పాత్రతో నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇదని తెలిపింది. వేశ్య పాత్రలో నటించేందుకు తనకు లేని అభ్యంతరం మీకెందుకు అన్న తరహాలో ఆమె జవాబు చెప్పింది.