రేస్..మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. చిత్రం ప్రమోషన్‌ని ప్రభాస్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా మొదలెట్టాడు. తాజాగా రేసింగ్ పోస్టర్ విడుదలచేస్తూ విడుదల తేదీని ప్రకటించాడు. పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటున్న సినిమాకి సంబంధించి ఆమధ్య విడుదల చేసిన రెండు చాప్టర్ వీడియోస్ సంచలనమైన విషయం తెలిసిందే. సినిమా వివరాలను యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్- విక్కీలు వెల్లడిస్తూ ప్రభాస్ అభిమానుల అంచనాలు అందుకునే ప్రయత్నంలో సాహోకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నామన్నారు. డినోయురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేయడం మరో ప్రత్యేకత. సాహోని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తోపాటు హలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతుందన్నారు.