ఆయన రూల్సే.. నాకు లెసన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత గ్యాప్ రావడానికి ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏమీ లేదు. ఒక ఏడాదిలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నపుడు కొంచెం గ్యాప్ రావడం సహజమే. అలాగే ఈ ఏడాదిలో నావి అన్ని భాషలలో కలిపి ఆరు సినిమాలు విడుదలవుతాయి.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి విజయాన్ని అందుకున్న రకుల్ ప్రీత్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవలాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. గ్లామర్ విషయంలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ దూసుకుపోతున్న రకుల్ ఈమధ్యే హిందీలో దేదే ప్యార్‌దే చిత్రంతోనూ విజయాన్ని అందుకుంది. తాజాగా సూర్య హీరోగా శ్రీరాఘవ దర్శకత్వంలో ఎన్‌జికె (నందగోపాలకృష్ణ)లో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కెకె రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఎన్‌జికె 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ముచ్చట్లు.

లీడర్ తరహాలో...
ఎన్‌జికె ఒక క్రిటికల్ థ్రిల్లర్. నా క్యారెక్టర్ పేరు వానతి. ఒక పొలిటికల్ సినారియోలో వున్న క్యారెక్టర్. చాలా స్ట్రాంగ్. ఒక మంచి లీడర్‌కు ఉండాల్సిన లక్షణాలున్న యువతి. ఆమె మైండ్‌లో ఏం ఆలోచిస్తుంది అనేది ఆమెకు మాత్రమే తెలుసు. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు.
నో రీసెర్చ్..
రీసెర్చ్ అంటూ ఏమీ చేయలేదు. అలాగని మనం ముందే ప్రిపేర్డ్‌గా వెళ్లినా సరే దర్శకుడు మనల్ని వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు. అందుకే ప్రతిరోజు ఒక బ్లాంక్ స్లేట్‌లా షూట్‌కి వెళ్ళేదాన్ని. అప్పుడే ఆయన చెప్పింది జాగ్రత్తగా చేయగలం. అందుకే ప్రతి ఒక్కరు ఒకసారైనా శ్రీరాఘవ దర్శకత్వంలో పనిచేస్తే వాళ్ళ పెర్‌ఫార్మెన్స్ ఎన్‌హాన్స్ చేసుకోవచ్చు. నాకు అలాంటి అవకాశం దొరికినందుకు హ్యాపీ ఫీలవుతున్నా.
సూర్యతో..
సూర్యతో పనిచేయడం చాలా నైస్. సూర్య.. ఎక్స్‌ట్రీమ్‌లీ స్వీట్. పెద్ద స్టార్ అయినా డీసెంట్‌గా ఉంటారు. సూర్యకన్నా ముందే షూట్‌కి వెళ్లాను. నీకు ఓకెనా.. నాకే కష్టం అవుతోంది.. నీకు తమిళ్ రాదు కదా.. యాక్టింగ్ ఏమైనా ఇబ్బంది అవుతోందా అని అడిగేవారు. అంత జాగ్రత్తగా చూస్తారు. ఆయన సెట్‌లో ప్రతిఒక్కరూ బావుండాలి అనుకుంటారు.
సాయిపల్లవితో..
సాయిపల్లవితో నా కాంబినేషన్ సీన్స్ నాలుగైదున్నాయ. సాయి పల్లవి చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్..
దర్శకుడు శ్రీరాఘవతో..
శ్రీరాఘవతో పనిచేసిన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన షూట్ చేసిన స్టైల్, క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన సెట్‌లో క్లాప్ ఉండనే ఉండదు. ఎందుకంటే క్లాప్ చూస్తే యాక్టర్స్‌కి డిప్రెషన్ వస్తుంది. ఎంత పెద్ద డైలాగ్ చెబుతున్నా సరే.. ఐస్ బ్లింక్ చేయకూడదు. అంతేకాదు, డైలాగ్‌కు ముందు రెండు సెకెండ్స్ గ్యాప్ ఇవ్వాలి. నాకే కాదు అందరు యాక్టర్స్‌కి ఇదే రూల్. ఆయన కానె్సప్ట్ అర్థం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది.
ఆ రూల్స్ గురించి..
ఒక యాక్టర్ డైలాగు చెబుతున్నపుడు ఐస్ బ్లింక్ చేస్తే పెద్ద స్క్రీన్‌మీద ఆ డైలాగ్ ఆడియెన్స్‌కి డిస్కనెక్ట్ అవుతుందట. అలాగే ఎక్కువ బ్రీతింగ్ చేస్తే బాడీ మూవ్‌మెంట్ అవుతుంది. అలా చెయ్యొద్దంటారు శ్రీరాఘవ. అందుకనే ఆయన సినిమాలు చూస్తే ప్రతి క్యారెక్టర్‌లోనూ ఒక రకమైన ఇంటెన్సీటి వుంటుంది. ప్రతి క్యారెక్టర్ తమ కళ్ళతోనే మాట్లాడగలవు. అందుకే ఆ పాత్రలు ఏమి ఆలోచిస్తున్నాయో ఎవ్వరికీ తెలీదు. అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇక త్రీ సెకండ్స్ రూల్ ఎందుకంటే టేక్ చెప్పగానే డైలాగ్ చెప్తే మనం ఇపుడు డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం అని తెలుస్తుంది. అలా కాకుండా ఒక త్రీ సెకండ్స్ వెయిట్ చేసి చెపితే ఆడియెన్స్ అది ఫీల్ అవ్వరు అని చెప్పారు.
మ్యూజిక్ సూపర్..
పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో సినిమాలో ఒకే పాటుంది. అది నాకు సూర్యకి మధ్య ఉండే రొమాంటిక్ సాంగ్. ఆ సాంగ్‌కి ఆడియెన్స్‌నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
బాలీవుడ్ ఫ్యూచర్..
అజయ్‌దేవగన్ ఫ్యూచర్ బాలీవుడ్ రకుల్ అని అన్నారు. ఈమధ్యే నేను అజయ్ దేవగన్‌తోకలిసి నటించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం రిలీజై మంచి హిట్ అయింది. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సినిమా కోసమే దాదాపు ఆరు నెలలు కష్టపడి చేశాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇంత రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు.
మన్మథుడు 2 గురించి..
నాగ్ సర్‌తో కలిసి నటించడం కొత్త ఎక్స్‌పీరియెన్స్. సినిమా స్టోరీ అయితే నేను రివీల్ చేయలేను కానీ నా క్యారెక్టర్ చాలా యంగ్ రోల్. సినిమా బాగా వస్తోంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

-శ్రీనివాస్ ఆర్ రావ్