31న మహేష్ కొత్త ప్రాజెక్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. మహర్షి విజయంతో మంచి జోరుమీదున్న మహేష్ వెంటనే తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మహేష్ 26వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది. మొన్ననే ఫ్యామిలీతో విదేశాలను చుట్టొచ్చాడు మహేష్. అయితే తన నెక్స్ట్ సినిమాను జూన్ 15న మొదలుపెట్టాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు డేట్ మార్చాశారు. మహేష్ 26వ సినిమా ఈనెల 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభంకానుంది. ఆరోజు సూపర్‌స్టార్ నట శేఖర కృష్ణ పుట్టిన రోజు!! తన తండ్రి పుట్టినరోజునే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెట్టాలని మహేష్ సలహాఇచ్చాడట.. అంతకంటే మంచి డేట్ ఏముంటుంది మహేష్ అంటూ పలువురు అభినందిస్తున్నారు. మొత్తానికి తన తండ్రి బర్త్‌డే సందర్భంగా సినిమాను మొదలుపెట్టనున్న మహేష్ జూన్ మొదటివారంనుండి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటాడు.
ఇటీవలే ఎఫ్2 లాంటి బంపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్‌కోసం కూడా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌నే ఎంపిక చేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాజీ క్రేజీ హీరోయిన్ విజయశాంతి కీ రోల్ పోషిస్తుందట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. దిల్‌రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.