నాని.. జెంటిల్‌మెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహనకృష్ణ ఇంద్రగంటి, నాని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘జెంటిల్‌మెన్’ అనే పేరును ఖరారు చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్ కథానాయకులుగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన రొమాన్స్, సెంటిమెంట్, వినోదంతో అందరినీ ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిందని తెలిపారు. మణిశర్మ అందించిన పాటలన్నీ హిట్ అవుతాయని, త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెనె్నల కిశోర్, ఆనంద్, రోహిణి, సత్యం రాజేష్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:డేవిడ్ నాథన్, సంగీతం:మణిశర్మ, కెమెరా:పి.జి.విందా, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:మోహన్‌కృష్ణ ఇంద్రగంటి.