మెంటల్ పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, నిఖిత జంటగా కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెంటల్ పోలీస్’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా ప పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘్భన్నమైన పాత్రల్లో నటిస్తూ ముఖ్యంగా పోలీసు పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు శ్రీకాంత్. అటు హీరోగా చేస్తూ ఇతర హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ తనదైన ఇమేజ్‌ని సంపాదించుకుంటున్నాడు. ఈ ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా వుంది. ఖచ్చితంగా ఈ సినిమా శ్రీకాంత్‌కు మరో ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ స్థాయి పేరు తెచ్చిపెడుతుంది’ అని దాసరి అన్నారు. దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ఓ మంచి మెసేజ్‌తో తెరకెక్కిన సినిమా ఇదని, శ్రీకాంత్ నట విశ్వరూపం మరోసారి చూస్తారని, తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, నాకు బాగా నచ్చిన కథ ఇదని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇదని అన్నారు.