స్పీడ్ పెంచాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఆయన చేసిన సినిమాలు 20 దాటలేదు. అంటే ఏడాదికొక సినిమా చొప్పున చేస్తూ వస్తున్నాడు. అయితే, వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళతానని, సినిమాలు మానేస్తానని చెబుతున్న పవన్, ఈ మూడేళ్ల గ్యాప్‌లో మహా అయితే రెండో మూడో సినిమాలు చేస్తాడని అంటున్నారు అందరూ. కానీ, ఆయన సినిమాల విషయంలో స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా తరువాత ఒకేసారి నాలుగైదు చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడని తెలిసింది. దాంతోపాటు అప్పుడెప్పుడో దాసరి నారాయణరావు నిర్మిస్తానన్న సినిమా కూడా లైన్‌లోకి రానుంది. దాంతోపాటు ఎ.ఎం.రత్నం నిర్మాతగా మరో సినిమా కూడా చేయనున్నారని తెలిసింది. పవన్ స్నేహితుడు శరత్‌మరార్ నిర్మాణంలో మరో సినిమా.. ఇలా మొత్తానికి ఐదు సినిమాలు సన్నాహాలు ప్రారంభించుకున్నాయని తెలిసింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పవన్ చెబుతూ- ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా అంటున్నాడు. దానిపేరు కూడా ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ అని సమాచారం. మరి పవన్ ఈ జోరుతో సినిమాలు చేస్తే మెగా అభిమానులకు నిజంగా పండుగే!