టీజర్‌లో నేనోరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్, శరత్‌కుమార్, రేష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేపా శ్రీకాంత్ నిర్మిస్తున్న ‘నేనోరకం’ టీజర్ హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి టీజర్ విడుదల చేసి మాట్లాడుతూ, టీజర్ చాలా ఆసక్తికరంగా వుందని, శరత్‌కుమార్ ఇంటెన్సివ్ వున్న నటుడని, టైటిల్ కూడా బాగుందని అన్నారు. మహిత్ ఈ సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉందని, తప్పకుండా పాటలు హిట్ అయి సినిమా కూడా మంచి విజయం సాధించాలన్నారు. దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ, సమాజంలో వున్న ఒక సమస్య ఇతివృత్తమే ఈ సినిమా అని, తండ్రీకూతుళ్లమధ్య వున్న అనుబంధాన్ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించామని, మహత్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడని అన్నారు. ఈ సినిమాలో శరత్‌కుమార్ నెగెటివ్ పాత్రలో కన్పిస్తారని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ- లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని మే మొదటివారంలో పాటలను విడుదలచేసి అదే నెల చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మహిత్ నారాయణ, కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి, ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, నిర్మాత:దేపా శ్రీకాంత్, దర్శకత్వం:సుదర్శన్ సలేంద్ర.