13న సాహో ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా విడుదలకి సిద్ధవౌతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ మేకింగ్ వీడియోస్‌తో సంచలనం సృష్టించింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్‌ను జూన్ 13న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సాహోని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తోపాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్‌ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్‌చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోల ప్రభాస్ స్టైలిష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు.