ఈ గేమ్ సరికొత్తది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాప్సి ప్రధాన పాత్రలో వైనాట్ స్టూడియోస్‌పై దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన చిత్రం -గేమ్‌ఓవర్. ఇలాంటి స్టోరీ జోనర్ ఇండియన్ మూవీస్‌కే కొత్త అంటోంది లీడ్ రోల్ పోషించిన తాప్సి పొన్ను. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జూన్ 14న విడుదలవుతోన్న సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన తాప్సి మీడియాతో ముచ్చటించింది.
సరికొత్త కథ: ఇంతవరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం -గేమ్ ఓవర్. వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలతో సాగే థ్రిల్లర్ ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు ఎగ్జైట్ అయ్యాను. ఇంతకుముందు ‘మాయ’ చిత్రాన్ని చేసిన దర్శకుడు అశ్విన్, ఈ కథను మరింత అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో వీడియో గేమ్స్ ఆడే అమ్మాయిగా కనిపిస్తా. వీడియో గేమ్స్‌తో చాలామంది యూత్ కనెక్టై ఉన్నారు కనక -ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు.
టెక్నికల్‌గా: కథ ఎంత కొత్త అనుభూతినిస్తుందో, మేకింగ్ పరంగానూ అశ్విన్ అంతే కొత్తగా డీల్ చేశాడు. టైక్నికల్ హైలెట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తో టేస్ట్ చూపించాడు. ఈ సినిమాను హిందీలో అనురాగ్ కశ్యప్ విడుదల చేస్తున్నారు. నేను నటించిన మూడో థ్రిల్లర్ ఇది. నిజానికి హారర్ థ్రిల్లర్ సినిమాలంటే నాకు భయం.
100కోట్ల సినిమా: నేను మెయిన్ లీడ్‌లో నటించిన హిందీ సినిమా బాద్లా ఏకంగా వందకోట్ల క్లబ్‌ను దాటడం ఎగ్జైట్ అనిపించింది. నా సినిమా అంటే 30-40 కోట్లు వసూలు చేస్తే సూపర్. అలాంటిది వందకోట్లు దాడడమంటే.. ఆ ఫీలింగ్ ఎలావుంటుందో మీరే చెప్పాలి.
రెగ్యులర్ కమర్షియల్: రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని నాకూ ఉంది. అయితే, ఈమధ్యే హిందీలో భిన్నమైన సినిమాలు రావడం, దాంతోపాటు వరుస అవకాశాలు వస్తుండటంతో హిందీలో బిజీ అయ్యాను. కమర్షియల్ ప్రాజెక్టులు వస్తే తప్పకుండా చేస్తా. ఇంతకుముందు తెలుగులో చాలానే చేశాను.
నటిగా..: నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనొక ఆర్టిస్ట్ అంతే. పాత్ర కోసం వాళ్లు ఎలా కావాలంటే అలా వౌల్డ్ అవుతా. పాత్ర కోసం రిస్క్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా.
మూడు భాషల్లో..: నటిగా మూడు భాషల్లో బిజీ కెరీర్ సాగిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. ఇతర భాషల్లోనూ మంచి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తా.
అప్పుడే కాదు: నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి ఇంకా టైంవుంది. పెళ్లిమాత్రమే కాదు, పిల్లలు, సంసారం.. అదో బాధ్యతాయుతమైన పెద్ద ప్రాసెస్. దానికి మానసికంగా సిద్ధమైనప్పుడు తప్పకుండా చేసుకుంటా.
తదుపరి చిత్రాలు: ప్రస్తుతం హిందీలో ఓ ప్రాజెక్టు చేస్తున్నా. దాంతోపాటు తమిళంలో ఒకటి, తెలుగులో రెండు ప్రాజెక్టులు చేయాల్సి ఉంది.