కాజల్.. ఊరమాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాపేరు సూర్య.. తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టును త్రివిక్రమ్‌తో మొదలెట్టాడు. వీళ్లిద్దరి కాంబోలో ఇది మూడో ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కోసం బన్నీతో పూజా హెగ్దె మరోసారి జోడీ కడుతోంది. రెండో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేసుకున్నట్టు ఇటీవలే చిత్రబృందం ప్రకటించటం తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసిన బన్నీ -త్రివిక్రమ్ ద్వయం, సెకెండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. దేశభక్తి నేపథ్యంగా సాగిన సీరియస్ సినిమా నాపేరు సూర్య.. ప్రతికూల ఫలితాన్ని ఇవ్వడంతో -తాజా ప్రాజెక్టుపై బన్నీ ఆచితూచి ఆడుగులేస్తున్నాడు. బన్నీ ఆలోచనల మేరకు -మాస్ ఆడియన్స్‌కి మంచి కిక్కునిచ్చే ‘స్పెషల్ అట్రాక్షన్’ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. ఊరమాస్ స్పెషల్ సాంగ్‌లో బన్నీ సరసన -కాజల్‌ను చూపించే ఆలోచన చేశాడని అంటున్నారు. ప్రత్యేక గీతంలో నర్తించడం కాజల్‌కు ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ఎన్టీఆర్‌తో కలిసి ‘పక్కా లోకల్’ అంటూ జనతా గ్యారేజ్‌ను ఊపు ఊపేసింది. కాజల్ తన గ్లామర్‌తో మాస్ ఆడియన్స్‌కి మంచి ఫీస్టే ఇచ్చింది. ఈసారి అంతకుమించి కాజల్‌తో ఓ ‘స్పెషల్ అట్రాక్షన్ సాంగ్’ను డిజైన్ చేయడానికి త్రివిక్రమ్ టీం సన్నద్ధమైనట్టు సమాచారం.