క్యూట్ లవ్‌స్టోరీగా ప్రేమజంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిఖిలేష్ తొంగరి దర్శకుడిగా, రామ్‌ప్రణీత్, సుమయ జంటగా తెరకెక్కిన చిత్రం -ప్రేమజంట. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్‌పై దగ్గుబాటి వరుణ్ జూన్ 28న సినిమాను విడుదల చేస్తున్నారు. మహేష్ మొగుళ్లూరి నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత మహేష్ మాట్లాడుతూ -తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో క్యూట్ పెయిర్ రామ్‌ప్రణీత్, సుమయ జోడీగా తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు నిఖిలేష్ ప్రతిభకు అద్దంపడుతుంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఆడియన్స్‌ని మెప్పిస్తుంది అన్నారు. దర్శకుడు నిఖిలేష్ మాట్లాడుతూ -క్యూట్ లవ్ స్టోరీగా సినిమా బాగావచ్చింది. దర్శకత్వంతోపాటు సంగీతమూ సమకూర్చాను. తొలి సినిమాతోనే హీరో హీరోయిన్లు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు.