గజేంద్రుడు.. 21న వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన పాత్రలతో నటుడిగా సత్తా చాటుకుంటున్న హీరో ఆర్య తాజా చిత్రం -కదంబన్. ఆర్యతో కేథరిన్ థ్రెస్సా జోడీ కట్టింది. రాఘవ దర్శకత్వం వహించిన సినిమా తమిళంలో ఘన విజయం సాధించటంతో, నిర్మాత ఉదయ్‌హర్ష వడ్డెల్ల -గజేంద్రుడు పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 21న సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంలో నిర్మాత మాట్లాడుతూ ‘హీరో ఆర్య తెలుగు ఆడియన్స్‌కీ పరిచయమే. విలన్‌గా ఎన్నో పాత్రలు చేశాడు. కేథరిన్‌కూ తెలుగులో ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ జంటగ కనువిందు చేయనున్న చిత్రమే గజేంద్రుడు. కొండ ప్రాంతాల్లోని గిరిజన సంతతిగా హీరో హీరోయిన్లు కనిపిస్తారు. సినిమా మొత్తం కొండలు, అడవుల్లో సాగుతూ థ్రిల్‌కి గురి చేస్తుంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సినిమాకు యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. 21న థియేటర్లకు వస్తున్న గజేంద్రుడిని ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.