ఔను, ఫ్లాపైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అంచనాలతో వస్తోన్న చిత్రాలు ఫ్లాపైతే -ఆ విషయాన్ని హీరోలు నిజాయితీగా స్వీకరిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువైంది. తాజాగా తమిళ హీరో సూర్య సైతం ‘ఔను, ఎన్జీకే ఫ్లాపైంది’ అంటూ ఒప్పుకున్నాడు. ఆరేళ్ల గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం -ఎన్జీకే. సూర్య హీరోగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో విడుదలకు ముందు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రకుల్‌ప్రీత్, సాయిపల్లవి హీరోయిన్లుగా వచ్చిన చిత్రం అటు తమిళం, ఇటు తెలుగులో ఒకేసారి విడుదలైంది. రెండు భాషల్లోనూ ఎన్జీకే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయలేకపోయంది. తాజాగా ఈ విషయాన్ని సూర్య అంగీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు-‘ఫెయిల్యూర్‌ను స్వీకరిస్తున్నా’ అంటూ. సినిమా ఫ్లాప్‌కు కారణాలను ఎత్తిచూపిన విమర్శకులకు ధన్యవాదాలు కూడా చెప్పాడు. మరిన్ని జాగ్రత్తలతో కొత్త ప్రాజెక్టుతో వస్తానని నిజాయితీగా ప్రకటించి అభిమానులకు రియల్ హీరో అయ్యాడు సూర్య.