ఫామ్‌లోకి వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరైన హీరో నితిన్ -కొంత గ్యాప్ తరువాత వరుస ప్రాజెక్టులతో మళ్లీ బిజీ అవుతున్నాడు. లై, చల్‌మోహన్‌రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలు నితిన్ అంచనాలను తలకిందులు చేయడం తెలిసిందే. దీంతో ఫెయిల్యూర్ మొనాటినీ నుంచి బయటపడటానికి ఇంచుమించు ఏడాదిపాటు నితిన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. వరుసగా ప్రాజెక్టులు సెట్ చేసుకోడానికి ఇంత గ్యాప్ తీసుకున్నానంటూ ఆమధ్య ఫ్యాన్స్‌కి సమాధానమిచ్చిన నితిన్, అన్నట్టుగా వరుస ప్రాజెక్టులతో మళ్లీ ఊపు చూపించేందుకు సిద్ధమవుతున్నాడట. ‘్ఛలో’తో మంచి హిట్టిచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ కోసం మంచి స్క్రిప్ట్ సిద్ధం చేయడం తెలిసిందే. ‘్భష్మ’ టైటిల్‌ను సైతం ఈ స్టోరీకి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సివున్నా, అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టును బుధవారంనుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది. నితిన్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా కనిపించనుంది. డిసెంబర్‌లో సినిమాను థియేటర్లకు తెచ్చే ఆలోచనతో ప్రాజెక్టు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూరె్తైన వెంటనే ... ‘తొలి ప్రేమ’తో హిట్టందుకుని ‘మిస్టర్ మజ్ను’తో ఒకింత వెనకపడిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో ప్రాజెక్టు చేయనున్నాడు. రెండు చిత్రాలనూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.