నా స్పేస్ నాకుంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్లు హీరోలుగా మారడమన్నది తెలుగు తెరపై కొత్త కాదు. చాలామంది కమెడియన్లు ఇప్పటికే హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాకపోతే ఎక్కువకాలం హీరోగా నిలదొక్కుకున్న కమెడియన్లు కనిపించరు. కమెడియన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సప్తగిరి ఇదివరకే హీరో అవతారం ఎత్తాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. తరువాత మధ్యలో రెండు సినిమాలు చేసిన ఆయన మళ్లీ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు అరుణ్‌పవార్ కాంబినేషన్‌తో ‘వజ్రకవచధర గోవింద’ చేశాడు. జూన్ 14న సినిమా విడదలవుతున్న సందర్భంగా
సప్తగిరి మీడియాతో ముచ్చటించాడు.

హీరోగా మొదటి సినిమా మంచి పేరు, గుర్తింపుని తెచ్చింది. ఆ సినిమాకు డబ్బూ, ప్రశంసలు రెండూ వచ్చాయి. డీమానిటైజేషన్ టైంలోనూ సినిమా మంచిగా రన్నవ్వడంతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి అభినందనలూ వచ్చాయి. ఆ టైంలోనే మళ్లీ మనం సినిమా చేద్దామని దర్శకుడు అన్నాడు. కానె్సప్ట్ అప్పుడే చెప్పాడు. ఇప్పటికి కుదిరింది. అదే వజ్రకవచధర గోవింద.
నా పాత్ర పేరు గోవింద్. అతను ఒక వజ్రానికి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కానె్సప్ట్. అందుకే టైటిల్ అలా పెట్టాం. అలాగే ‘వజ్ర కవచధర గోవింద’ అనేది వేంకటేశ్వరుని సహస్ర నామాల్లో ఒకటి. అలా టైటిల్ కొంచెం లెంగ్తీ అయినా, ఎన్నిసార్లు తలచుకుంటే అంతమంచిదన్న ఉద్దేశమూ ఇందులో ఉంది. ఈ కథను మహేంద్ర నాకు తగ్గట్టుగా మలచి పూర్తిస్థాయి వినోదాన్ని ప్రేక్షకులకు అందేలా చేశాడు.
కథాక్రమం క్లైమాక్స్‌లో హీరో గతం మర్చిపోతాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటాడు. జబర్దస్త్ ఆర్టిస్టులు మొత్తం కలిసి హీరోకి గతాన్ని గుర్తు చేసే క్రమంలో ఈ పాట వస్తుంది. జబర్దస్త్ బ్యాచ్‌కి లీడర్‌గా శ్రీనివాస్‌రెడ్డి కనిపిస్తాడు. ఈ పాట హక్కులను చైనానుంచి తీసుకున్నారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమాలో -నేనొక దొంగ. ఊళ్లో ఒకరిదగ్గర మోసపోయి, ఊరొదిలి బయటకు వస్తాను. బాగా డబ్బు సంపాదించి ఊరును బాగుచేయాలన్న నిర్ణయంతో దొంగనవుతాను. ఆ మార్గంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేసే పని గొప్పదైతే సరిపోదు, వెళ్లేదారి కూడా మంచిదైతేనే దైవానుగ్రహం ఉంటుందని గ్రహించి మంచివాడినవుతాను. నటనకు స్కోప్‌వున్న పాత్ర.
సినిమాలో పక్కా కమర్షియల్ హీరోగా కనిపించను. కామెడీ హీరోగానే ఎంటర్‌టైన్ చేస్తా. కమర్షియల్ లెవెల్లో మాస్ ఎలివేషన్స్ ఉన్నా, అవీ కామెడీ పంథాలోనే సాగుతుంటాయి. కామెడీతోపాటు సెకండ్ హాఫ్‌లో మంచి సెంటిమెంట్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలను కర్నూలులోని బెల్గామ్ గుహల్లో షూట్ చేశాం. ప్రమాదకరమైనా, రిస్క్ చేద్దామనిపించింది. నాతోపాటు హీరోయిన్ కూడా ధైర్యం చేసింది.
టీజర్ చూసి డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య మా నిర్మాతను కాంటాక్ట్ చేశారు. ఫ్యానీ రేటుతో సినిమా విడుదల హక్కులు తీసుకున్నారు. పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన, మా సినిమాను తీసుకోవడం చాలా హ్యాపీ.
తదుపరి చిత్రాల గురించి చెప్పాలంటే -‘సప్తగిరికి దెయ్యం పట్టింది’ ఉంటుంది. ఆ చిత్రాన్ని పార్ట్ 1, 2లుగా తీసే ఆలోచన ఉంది.
నేనెప్పుడూ హీరోగా చేస్తానని అనుకోలేదు. నా స్పేస్ నాకుంది, అంతే. అయితే కమెడియన్‌గా చేయడానికి మాత్రం నేనెప్పుడూ సిద్ధమే.