నిఖిల్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న యువ హీరో నిఖిల్, తాజాగా ‘శంకరాభరణం’ సినిమాతో ముందుకొచ్చాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నిఖిల్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు వుంటారని, ఇప్పటికే తాప్సీ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది. మరో హీరోయిన్‌గా కుమారి 21 ఎఫ్‌తో సంచలనం సృష్టించిన హెబా పటేల్‌ను తీసుకోనున్నారు. దాంతోపాటు మరో హీరోయిన్‌గా ఫైసా ఫేమ్ కేథరీన్ ట్రెస్సా కూడా నటిస్తుందని తెలిసింది. తెలుగులో రెండు మూడు చిత్రాలు చేసినా కమర్షియల్‌గా తన కెరీర్‌కు ఏ సినిమా సరైన గుర్తింపునివ్వకపోవడంతో కేథరీన్ తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మళ్లీ తెలుగులో వరుసగా సినిమాల్లో నటిస్తూ అవకాశాలు అందుకుంటోంది. మరి నిఖిల్‌తో నటించిన ఈ సినిమాతోనైనా ఈ భామ జాతకం మారుతుందో లేదో చూడాలి.