సుకుమార్‌తో చరణ్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రామ్‌చరణ్ తమిళంలో హిట్టయిన ‘తనిఒరువన్’ రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటించే మరో చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తిచేసి, వచ్చే సంక్రాంతి బరిలో దింపడానికి ప్లాన్ వేస్తున్నాడు చరణ్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు చరణ్ బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ నిర్మిస్తాడని అంటున్నారు.