పాటకూ.. రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీజేలో -బికినీ షోతో కుర్రకారుని మాయలో పడేసిన పూజా హెగ్డే -టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. స్టార్ హీరోలకు సింగిల్ ఆప్షన్ -పూజా అంటే అతిశయోక్తి కాదు. వీర రాఘవకు సొంతంగా డబ్బింగ్ చెప్పిన ఈ బ్యూటీ, త్వరలో ఓ పాటేసుకోబోతోందట. అదీ త్రివిక్రమ్ సినిమా కోసమే. అల్లు అర్జున్ తాజా ప్రాజెక్టులో పూజా హీరోయిన్. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదలైన రెండో షెడ్యూల్‌లో జాయినైంది. పాట పాడాలన్న పూజ కోరికను ఓ ఇంటర్వ్యూలో చదివిన తమన్, ఇలా ఆమె కోరిక తీర్చబోతున్నాడట. పూజ హస్కీ వాయిస్‌లో ఓ గమ్మత్తుంటుంది. స్పెషల్ ట్యూన్ ఒకటి కంపోజ్ చేసిన తమన్ త్వరలోనే రికార్డు చేయనున్నట్టు సమాచారం. అయితే, డ్యూయెట్టా? సోలోనా? అన్నది తెలియాల్సివుంది. ఇటు ప్రభాస్ ప్రాజక్టు, అటు బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్- 4 ప్రాజెక్టు.. సౌత్, నార్త్‌లో పూజ బిజీ అయిపోయింది.