అమెరికా ఆశలపై సెటైర్ ప్రెజర్ కుక్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి రొనాక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై, సుశీల్ సంయుక్తంగా నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా -ప్రెజర్ కుక్కర్. ఇద్దరు దర్శకులు, ముగ్గురు నిర్మాతలు రూపొందించిన చిత్రం ఫస్ట్‌లుక్‌ను నిర్మాత డి సురేష్‌బాబు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ టిపికల్ ఫిలిమ్స్‌తో వస్తున్న ఇలాంటి కొత్తవారిని తప్పకుండా ప్రోత్సహించాలన్నారు. వైవిధ్యమైన టైటిల్‌తో ఆకట్టుకుంటున్న సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శక నిర్మాత సుజై మాట్లాడుతూ -పిల్లల్ని ఇంజనీరింగ్ చేయించి, అమెరికా పంపించి.. ఇక్కడ గొప్పలు చెప్పుకునే మధ్యతరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్తమ్రే -ప్రెజర్ కుక్కర్ అన్నారు. ఏంచేసైనా యుఎస్ వెళ్లాలని అష్టకష్టాలుపడ్డ కుర్రాడు.. తరువాత ఆ ఆలోచన ఎందుకు విరమించుకున్నాడు? ఆత్మవిశ్వాసంతో ఎలా నిలబడ్డాడు? అన్న అంశాలను ఈ కథలో చూపిస్తున్నామన్నారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ మంచి మెసెజ్ ఓరియంటెడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిపై సెటారికల్‌గా, యూత్‌కు ఇన్‌స్పిరేషన్‌లా సినిమా ఉంటుందన్నారు. మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ టెక్నీషియన్లు మంచి అవుట్‌పుట్ ఇచ్చారని, ప్రాజెక్టు కోం పని చేస్తున్న అందరికీ మంచి లైఫ్ ఉంటుందన్నారు. హీరో సాయిరొనాక్, హీరోయిన్ ప్రీతి తదితరులు మాట్లాడారు.