రకుల్‌తో మరొకటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొమాంటిక్ హీరోగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి మన్మథుడు-2తో నాగ్ సిద్ధమైన విషయం తెలిసిందే. నాగ్‌తో రకుల్‌ప్రీత్, కీర్తిసురేష్ రొమాన్స్ చేయనున్నారు. కీలకమైన పాత్రలో సీనియర్ నటి లక్ష్మి కనిపించనున్నారు. ఆగస్టు 9న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించిన నేపథ్యంలో -తాజాగా సినిమా నుంచి ఓ టీజర్ వదిలారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన్మథుడు 2’ టీజర్‌కు మంచి రెస్పాన్ వచ్చింది. అయితే, టీజర్‌లో కేవలం నాగ్‌ని మాత్రమే చూపించటం, హీరోయిన్లు కనిపించకపోవటంపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. దీనిపై దర్శకుడు రాహుల్ తాజాగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రకుల్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో, ఆమెపై తీసిన సన్నివేశాలతో మరో టీజర్ వదలే ఆలోచన ఉన్నట్టు చెబుతున్నాడు. తాజాగా విడుదల చేసిన టీజర్లో రకుల్‌ను చూపించకపోవడానికి కారణం -ఆమెతో ప్రత్యేకంగా టీజర్ కట్ చేయడానికేనని చెప్పినట్టు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యే వరకూ డిఫరెంట్ టీజర్లతో ఆసక్తి రేకెత్తించే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు కనిపిస్తోంది.