గోల్డెన్ చాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ టాప్‌స్టార్స్‌లో ఒకరైన తలపతి విజయ్ తన 63వ చిత్రంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఆయన లోకేష్ భాగ్యరాజ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వెలువడింది. లోకేష్ గతంలో హీరో సందీప్‌కిషన్‌తో ‘నగరం’ అనే సినిమాని తెరకెక్కించాడు. తాజా ప్రాజెక్టులో విజయ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును నిర్మాత, దర్శకుడు పరిశీలిస్తున్నారట. ఈమేరకు త్వరలో రకుల్‌తో చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. విజయ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు రకుల్ అనేక సందర్భాల్లో మనసులో మాట బయటపెట్టింది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోవడం ఖాయం. తాజాగా రకుల్ సూర్యతో కలిసి ‘ఎన్‌జికె’ చేసంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించలేకపోవడంతో, రకుల్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. తాజాగా నాగార్జునతో తెలుగులో చేసిన ‘మన్మథుడు 2’ ఆగస్టులో విడుదలవుతోంది. ఆ ప్రాజెక్టు తనకు మంచి పేరు తేగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది రకుల్.