ధనుష్.. ఓకేనట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అ’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చూపించిన ప్రశాంత్ వర్మకు పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. విలక్షణమైన కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడంటూ ‘అ’తోనే ప్రశంసలందుకున్న ప్రశాంత్ -ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన కల్కితో బిజీగా ఉన్నాడు. కల్కి ఈనెల 28న థియేటర్లకు రానుంది. విడుదలకు ముందే కల్కిపై ప్రశాంత్ ఎఫర్ట్‌కు అప్లాజ్ వస్తుండటంతో, తమిళ హీరో ధనుష్ ఓ చాన్స్ ఇచ్చి చూద్దామన్న ఆలోచనలో ఉన్నాడట. ధనుష్‌తో ప్రశాంత్‌కు ప్రాజెక్టు కన్ఫర్ట్ అయినట్టేనని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం ధనుష్‌ను కలిసి ప్రశాంత్ వర్మ ఒక కథ చెప్పాడని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకోమంటూ ధనుష్ చెప్పాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రాజెక్టు కనుక కొలిక్కి వస్తే -తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.