21న స్పెషల్‌గా వస్తోన్న అజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ హీరోగా చేస్తున్న చిత్రం- స్పెషల్. మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ కానె్సప్ట్‌తో వస్తోన్న సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఒక అమ్మాయిని మోసం చేసిన వాళ్లను మైండ్ రీడర్ కానె్సప్ట్‌తో తెలుసుకుని ఎలా అంతం చేశాడన్నది కథాంశం అని దర్శకుడు వాస్తవ్ చెబుతున్నాడు. గతంలోనూ ఒకటి రెండు సినిమాల్లో అజయ్ హీరో పాత్రలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా ‘స్పెషల్’తో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత వాత్సవ్ మాట్లాడుతూ -మైండ్ రీడర్ స్టోరీ ఫెంటాస్టిక్ థ్రిల్లర్. గజిని టైప్ జోనర్ ఇది. లవ్, ఎమోషన్స్ అన్నివున్న కథ. చిన్న సినిమాగా వస్తున్న బిగ్ అప్లాజ్ అందుకుంటుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు అజయ్ రాకెట్‌లాంటి హీరో. హీరోయిన్ అక్షిత మంచి పాత్రలో కనిపిస్తుంది అన్నారు. హీరోయిన్ అక్షిత శ్రీనివాస్ మాట్లాడుతూ -థ్రిల్లర్స్ అంటే ఇష్టం. చిన్నపుడు విక్రమ భేతాళ్లుడు లాంటి సినిమాలు ఆసక్తిగా చూసేదాన్ని. హీరో హీరోయిన్ల కంటే కథకి ఆడియన్స్ ఎక్కువ ప్రాథాన్యత ఇస్తున్న తరుణంలో -దర్శకుడు వాస్తవ్ మంచి కథను తెరకెక్కించారు. ఆర్‌ఆర్ అద్భుతంగా వచ్చింది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.