ఇదో.. సూపర్‌మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం -కృష్ణారావ్ సూపర్‌మార్కెట్. కొత్త దర్శకుడు శ్రీనాథ్ పులకరం తెరకెక్కిస్తున్న చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ తన కొడుకును హీరోగా ఇంట్రొడ్యూస్ చేయడానికి తాను సినిమా నిర్మాణం చేపట్టానని గౌతమ్ చెప్పినపుడు హ్యాపీ అనిపించింది. ఈ సినిమాలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. కొత్త టీంను ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ సినిమా అనే పెద్ద యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన టీంకు అభినందనలు. హీరో, దర్శకుడు.. అంతా వివిధ పాత్రల్లో తమ ప్రతిభ చూపేందుకు వస్తున్నారు. ఆశీర్వదిద్దాం అన్నారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ సినిమా తాను చూశానని బాగా వచ్చిందన్నారు. పరిశ్రమలో ఎవరి సింపతీ ఎవరికీ అక్కర్లేదని, కొత్తగా వస్తున్న టీం తమ ప్రతిభతో పైకి రావాలని ఆకాంక్షించారు. గౌతమ్‌రాజు మాట్లాడుతూ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది, సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరెకెక్కించాడు అన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మంచి ప్రాజెక్టు పూర్తి చేశామన్న సంతృప్తి ఉంది. నా కెరియర్‌కు ఇదో మైలు రాయి అవుతుంది. పరిశ్రమ నుంచి చూసిన ప్రముఖులంతా ప్రశంసించారు. మంటి టెక్నీషియన్స్, హీరోయిన్ ఎల్సా.. దొరకడం మా అదృష్టం. నన్ను ప్రోత్సహించమని రిక్వెస్ట్ చేస్తున్నా అన్నారు. దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ నేనొక్కడినే కథ రాసుకున్నా. అక్కడినుంచి మొదలైన ప్రయాణంలో ఇంత టీం అవుతుందని అనుకోలేదు. టీంలో ప్రతి ఒక్కరూ సినిమా కోసం కష్టపడ్డవాళ్లమే. మమ్మల్ని ప్రోత్సహించండి’ అన్నారు.