కీర్తి’కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ త్వరలోనే ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఎన్టీఆర్ అతిథి పాత్రకు ఒప్పుకోవడం చిన్న విషయమేమీ కాదు. కాకపోతే, ఆయన చేస్తున్నది ‘మహానటి’ కోసమే అంటున్నారు సిన్నిహితులు. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు నాగేంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అతిథి పాత్రకోసం ఎన్టీఆర్‌ను అడిగారట. పాత్ర కేవలం పది నిముషాలు మాత్రమే ఉంటుందని, కానీ ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో ఎన్టీఆర్‌ను సంప్రదించారట. కథను విన్న ఎన్టీఆర్ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎన్టీఆర్ అతిధి పాత్రలో కనిపిస్తున్నాడంటే, ఆ సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం. ఈ ప్రాజెక్టును మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవలే భారీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తిచేసి, గతవారమే విదేశాల్లో మరో షెడ్యూల్ మొదలుపెట్టారు. మొత్తానికి మహిళా ప్రాధాన్యత కలిగిన కథతో సినిమా చేస్తున్న కీర్తిసురేష్‌కు మంచి క్రేజ్ రావడం ఖాయమన్న నమ్మకంతో ఉంది చిత్రబృందం.