మృగరాజు వేట.. షారూక్ మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రూర మృగాలు మనుషులవలే మాట్లాడతాయి. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి. కలిసి మెలిసి జీవిస్తాయి. ఏదైనా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం -తన రాజ్యంలోని జంతువులను కాపాడుతూ ఉంటుంది. ఇదంతా డిస్నీ సిద్ధం చేసిన లయన్‌కింగ్ సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. లయన్ కింగ్ కథకి హీరో. అలానే సింబతోపాటు టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివిపంది ఈ కథలో ముఖ్యపాత్రలు. కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన లయన్‌కింగ్‌ని -తరువాత డిస్నీ 2డి యానిమేటెడ్ సినిమాగా 90ల్లో విడుదల చేసింది. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్‌కింగ్ ఫాన్స్‌కి, కామిక్ అభిమానులకి కొత్త అనుభూతి ఇచ్చేందుకు సిరికొత్తగా సిద్ధం చేసింది. జూలై 19న లయన్ కింగ్ థియేటర్లకు రానుంది. ఈ విజువల్ వండర్‌కి మరో స్పెషల్ అట్రాక్షన్ ఎంటంటే -షారుఖ్‌ఖాన్ గాత్ర దానం చేయడం. లయన్‌కింగ్‌లో కీలక పాత్ర ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పారు. ఇక ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్‌ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్యభాషల్లో సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే మార్వెల్, డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ బ్లాక్‌బస్టర్‌గా వసూళ్ల సునామీ సృష్టించింది. అల్లాద్దీన్ రూపంలో మరోమారు డిస్నీ మూవీ లవర్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడు లయన్‌కింగ్ రూపంలో మరో హిట్ తన అకౌంట్‌లో పడనుందని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగులోనూ లయన్‌కింగ్ భారీస్థాయిలో విడుదలకి సిద్ధమైంది.