పలాస.. ఆత్మ కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాంధ్రలోని ఓ ప్రాంతం ఆత్మను తెరమీదకు తెచ్చే ప్రయత్నం -పలాస 1978. తెలుగు సినిమా కథలు కొన్ని చట్రాల్లో బిగుసుపోయిన టైంలో కంచరపాలెం ఆ గిరిని దాటి కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించింది. ఆ కోవలో పలాస కూడా నిజమైన ఎమోషన్స్ చుట్టూ, సమాజంలో పేరుకున్న అసమానతలకు వెండితెరపై చూపించనుంది. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో రక్షిత్ బర్త్‌డే సందర్భంగా దర్శకుడు మారుతి, చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -నిర్మాత ప్రసాద్ కథ చెప్పినపుడు మామూలు కథే అనుకున్నా. కానీ ఇపుడు సినిమా గురించి తెలిసాక, కథను ఊరిలో ఉండి తిరిగి అనుభవించి రాశారు. కంచరపాలెంలాగా ఇదీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందిస్తుందన్న నమ్మకం కలుగుతోంది’ అన్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ బాగుందని, తమ్మారెడ్డి ఇలాంటి చిత్రాలకు అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -కథను అయిష్టంగానే విన్నా. కానీ విన్నాక ఇందులో విషయం గమ్మత్తు అనిపించింది. సినిమా పలాసకు కొత్త గుర్తింపు తెస్తుంది అన్నారు. సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ -ఆర్టిస్టుగా అప్పుడప్పుడూ కన్పిస్తున్నా, ఇందులో మాత్రం క్రూరమైన పాత్ర చేశా. కంచరపాలెం, సుబ్రమణ్యపురం తరహాలో రెండు గంటలు పలాసలో ప్రేక్షకుల్ని తిప్పుతుంది అన్నారు. హీరో రక్షిత్ మాట్లాడుతూ -దర్శకుడిని పూర్తిగా నమ్మాను. రెండు నెలలపాటు పలాసలో షూట్ చేశాం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు. ఎన్ని కష్టాలు పడినా, సినిమా చూశాక మర్చిపోయాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు. దర్శకుడు కరుణ మాట్లాడుతూ -తెలుగులో నేటివ్ కథలు తక్కువగా వస్తున్నాయి. పలాస ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న కథను తీసుకొని ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతో కథనుప్రేక్షకుల ముందుకు తెగలిగాను. కెమెరామెన్ వినె్సంట్ అరుల్ నా కథకు ప్రాణం పోశారు. 40 ఏళ్ళపాటు సాగే కథను 40 రోజుల్లో తీయగలిగాం అంటే అది మా టీం నాకు అందించిన సహకారమే. ఫస్ట్‌లుక్ విషయంలో కొత్తగా ట్రై చేశాం. అందరూ లుక్ బాగుందంటుంటే సంతోషంగా ఉంది అన్నారు. రచయిత నాగేంద్ర, కెమెరామెన్ వినె్సంట్ అరుల్, హీరోయిన్ నక్షత్ర తదితరులు మాట్లాడారు.