ట్రైలర్‌లో రైట్ రైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, పూజాజవేరీ, ప్రభాకర్ ముఖ్యపాత్రల్లో మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న ‘రైట్ రైట్’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, వంశీ పైడిపల్లి, నిర్మాత ఎం.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బి.గోపాల్ మాట్లాడుతూ, ట్రైలర్ బాగుందని, రైట్ రైట్ అనేది పాపులర్ పదమని, సుమంత్ అశ్విన్‌కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అన్నారు. ఎం.ఎస్.రాజు ఎందరో కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశారని, ఈ సినిమాతో మను కూడా పరిచయమవుతున్నాడని అన్నారు. మారుతి మాట్లాడుతూ, పోస్టర్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని, సుమంత్ అశ్విన్ కెరీర్ రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా చేయాలని నటించిన సినిమా ఇదని, మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు మను ఈ టీమ్ అందరికీ ఆల్‌ది బెస్ట్ అన్నారు. దర్శకుడు మను మాట్లాడుతూ, డ్రైవర్‌కు కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ సినిమాఅని, సుమంత్ బాగా నటించాడని, మే చివరి వారంలో లేదా జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, నాకు బాగా నచ్చిన కథ ఇదని, ఇలాంటి సబ్జెక్ట్‌ను మను బాగా డీల్ చేశాడని, ఈ సినిమాకు మంచి టెక్నీషియన్లు కుదిరారని అన్నారు. నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమాతో నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న ఎం.ఎస్.రాజుగారికి కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: జె.బి, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కోప్రొడ్యూసర్: ఎం.వి.నర్సింహులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను.