ఆసువుగా పుట్టలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం సృజనాత్మకత ఆధారంగా రాజ్ ఆర్ తెరకెక్కించిన చిత్రం -మల్లేశం. యంగ్ కమెడియన్
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రంలో జోడీగా అనన్య నటించింది. ఈ కథ అంత ఆసువుగా పుట్టింది కాదని, దీని వెనుక ఒకింత యానత ఉందంటున్నాడు దర్శకుడు. జూన్ 21న సినిమా విడుదల కానున్న
సందర్భంగా దర్శకుడు మీడియాతో మచ్చటించాడు.
మల్లేశం బయోపిక్ ఆలోచన ఎలా వచ్చింది?
రెండున్నరేళ్ల క్రితం మల్లేశం బిట్ ఒకటి చూశా. నేత కార్మికురాలైన తల్లి కష్టాన్ని బాల్యంనుంచే చూసిన మల్లేశం, అలాంటి కష్టం ఇంకెవ్వరూ పడకూడదని ఆసు యంత్రానికి పురుడుపోశాడు. మల్లేశం కృషిని గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. ఇవే నన్ను ఆకట్టుకున్న అంశాలు.
సినిమా గురించి..
మదర్ సెంటిమెంట్‌తోపాటు, జీవితానికి సంబంధించి స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమా నడిచే కాలం 1992 నుంచి 1999 వరకూ. ఆ ఏడేళ్ల మల్లేశం జీవితాన్ని హైలెట్ చేశాను. సినిమాలో ఒక సామాన్య వ్యక్తి గొప్ప ఆవిష్కరణకు పూనుకోవడం స్ఫూర్తివంతంగా చూపించా.
సినిమాలపై మీ ఆసక్తి..?
పుట్టింది, పెరిగింది రామగుండంలోనే. స్వస్థలం మాత్రం కరీంనగర్ జిల్లా. నాన్న ఉద్యోగరీత్యా రామగుండంలోనే ఎక్కువగా గడిపాను. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. యుఎస్ వెళ్ళా. అక్కడే కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు స్క్రిప్ట్స్ రాశా. ఓ స్నేహితుడి సహకారంతో తమిళ థ్రిల్లర్‌కు ప్రొడ్యూస్ చేశా. 2007లో అది విడుదలైంది కానీ, సక్సెస్ కాలేదు. చాలా ఏళ్ల తరువాత మల్లేశం కథ తెలుసుకుని, ఆ ప్రాజెక్టు ఇలా పూర్తి చేశా.
కమెడియన్‌గా ప్రియదర్శి సక్సెస్. ఎమోషనల్ కంటెంట్‌కు ఎలా ఎంచుకున్నారు?
కథ రాస్తున్నపుడే నాని, విజయ్ దేవరకొండలాంటి హీరోలను అనుకున్నా. కానీ స్క్రిప్ట్ పూర్తయ్యక నటీనటుల ఎంపిక టైంలో పెద్ద హీరోలు మూడేళ్ల వరకూ అందుబాటులో లేరని తెలిసింది. అయితే మల్లేశం పాత్రకు ప్రియదర్శి అయితే బాగుంటుందని ఓ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. తరువాత ప్రియదర్శి విలన్‌గా చేసిన బొమ్మల రామారం, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాక నా నమ్మకం బలపడింది. మల్లేశం పాత్రకు తనే కరెక్ట్ అనుకున్నా.
కమర్షియల్‌గా..
సినిమా తీయాలన్న నిర్ణయం టైంలోనే చాలామంది హెచ్చరించారు. పెట్టిన డబ్బులో రూపాయి కూడా తిరిగి రాదన్నారు. భయపెట్టారు కూడా. కానీ నేను రాసుకున్న స్క్రిప్ట్‌పై నమ్మకముంది. సినిమాలో కమర్షియల్ అంశాల్ని కలబోసి సినిమా తీశా. చక్కటి హాస్యాన్ని మేళవించాను.
ఇతర నటీనటుల గురించి..
మల్లేశం పాత్రకు ప్రియదర్శి న్యాయం చేశాడు. ప్రియదర్శి తల్లి పాత్రలో యాంకర్ ఝాన్సీ, భార్య పాత్రలో అనన్య చక్కగా నటించారు. వీళ్లెవ్వరూ నటిస్తున్నట్టు అనిపించదు. అంత సహజమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా మీకందరికీ నచ్చుతుంది.
తరువాతి ప్రాజెక్టులు..
ఇంకో రెండు కథల అనుకున్నా. ప్రస్తుతం మల్లేశం పనుల్లో బిజీగా ఉన్నా. సినిమా విడుదలయ్యాక వాటిగురించి వివరిస్తా.