హీరోయిజం ఈజీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జె తెరకెక్కించిన చిత్రం -ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంలో హీరో నవీన్ మీడియాతో ముచ్చటించాడు.

చేతిలో ఒక్క కేసు కూడాలేని డిటెక్టివ్‌కు అనుకోకుండా పెద్ద కేసు తగిల్తే -ఎలా హ్యాండిల్ చేశాడన్నదే మెయిన్ స్టోరీ. డిటెక్టివ్ జోనర్‌లో ఇటీవలి కాలంలో సినిమాలు రాలేదు. దీంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను తెరకెక్కించాం.
బాల్యం నుంచే నటన అంటే ఆసక్తి. స్కూల్‌డేస్‌లో ఓ నాటకంలో చాన్స్ వచ్చింది. నవ్వుతూ ఉండటమే ఆ పాత్ర. అలా నవ్వుతో మెప్పించా. అంతా ప్రశంసించటంతో నటనపై ఆసక్తి పెరిగింది.
నాన్న బలవంతంమీద ఐఐటి రాసి భోపాల్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆర్నెల్లలో విషయం అర్థమైపోయింది. ఇక ఫ్రెండ్స్‌తో థియేటర్ క్లబ్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించటం మొదలెట్టా. అలా నాలుగేళ్ల కాలం నన్ను నటనకు దగ్గర చేసింది.
సినిమాల్లోకి రావడం ఒత్తిడి తప్పలేదు. నటించాలన్న నా నిర్ణయం ఇంట్లో చెప్పటంతో నాన్నతో -బొమ్మరిల్లు క్రైమాక్స్ సీన్ రిపీటైంది.
తెలుగులో డైరెక్ట్‌గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం మనవల్ల కాదులే అన్న విషయం అర్థమైంది. డ్రామాలో పెర్ఫెక్షన్ కోసం ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నా. అక్కడే డ్రామాతో కెరీర్ ప్రారంభించా.
ఫేస్‌బుక్ ద్వారా దర్శకుడు స్వరూప్ నన్ను అప్రోచ్ అయ్యాడు. తను కథ చెప్పినపుడే బాగా నచ్చింది. నిజానికి కొంతమంది హీరోలు కథపట్ల ఆసక్తి చూపించినా, నాకోసం దర్శకుడు వెయిట్ చేయడం ఇంకా నచ్చింది. అలా ఇద్దరం ఏడెనిమిది నెలలు ట్రావెల్ చేశాం.
నా కెరీర్‌కి ముంబై జర్నీ ఓ టర్నింగ్ పాయింట్. పరిశ్రమకు అర్థం చేసుకున్నది ఆ టైంలోనే. ఆ కొద్దికాలం నాకు చాలా హెల్పైంది.
తదుపరి ప్రాజెక్టుల గురించి అంటే -ప్రస్తుతానికి రెండు కథలు విన్నాను. బావున్నాయి. హిందీ ప్రాజెక్టులోనూ ఓ కీలక పాత్ర చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే -ఇప్పుడు నా దృష్టి అంతా విడుదల కావాల్సిన సినిమాపైనే ఉంది.