లీడ్‌రోల్ కానక్కర్లే.. మంచి పాత్ర చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగులో ఎక్కువగా సెకండ్ లీడ్ పాత్రలు చేస్తున్నారని అడుగుతున్నారు. నేను సెకండ్ లీడా ఫస్ట్ లీడా అని చూసుకోను. పాత్ర నచ్చితే చేయడానికి రెడీ’ అని అంటోంది హీరోయిన్ కేథరిన్ త్రెస్సా. ‘ఇద్దరమ్మాయిలతో’.. చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. మరోవైపు తమిళంలో కూడా క్రేజీ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న కేథరిన్ తాజాగా అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ చిత్రంలో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతున్న సందర్భంగా అందాల భామ కేథరిన్ త్రెస్సాతో ఇంటర్వ్యూ..
ఈ సినిమాలో మీ పాత్ర?
- ఇందులో నేనొక యంగ్ ఎమ్మెల్యేగా కనిపిస్తాను. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలో ఎవరూ నటించలేదని చెప్పాలి. ఓ బాధ్యతగల రాజకీయ నాయకురాలిగా కనిపిస్తాను.
నిజ జీవితంలో రాజకీయాల గురించి ?
- అంత సమయం లేదు. నాకున్న సినిమాలు చేయడానికే సరిపోవడం లేదు. ఇంక రాజకీయాల గురించి ఆలోచించను. ఈ పాత్రకోసం ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. డైరెక్టర్ చెప్పిందాన్ని ఫాలో అయ్యా.
రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన వుందా?
అబ్బో.. అలాంటిది ఏమీ లేదు. ఇప్పటివరకూ ఓటు కూడా వేయలేదు. మీరు నమ్మరు కానీ నాకు ఓటర్ ఐడీ కూడా లేదు.
అల్లు అర్జున్‌తో మూడో కాంబినేషన్ గురించి?
అల్లు అర్జున్‌తో పనిచేయడం ఆనందంగా వుంటుంది. తను మంచి ఎనర్జిటిక్ హీరో. ఎప్పుడూ అలిసిపోడు. చాలా కష్టపడతాడు. దాంతోపాటు మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి. తన డెడికేషన్ చూసి మనం ఆయనలా చేయాలని అనిపిస్తుంటుంది. అతనితో మూడో కాంబినేషన్ ఇది. యాదృచ్ఛికంగానే ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
తెలుగులో సెకండ్ లీడ్ పాత్రలే వస్తున్నాయి కదా?
- చాలామంది ఇదే అడుగుతున్నారు. నేను మెయిన్ లీడా, సెకండ్ లీడా అనేది పట్టించుకోను. నా పాత్ర బావుందా లేదా. మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్ధం. తెలుగులో నాకు ఎగ్జైటెడ్‌గా అనిపించే రోల్స్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయడం లేదు.
దర్శకుడు బోయపాటి శ్రీనుతో పనిచేయడం?
తెలుగులో నేను చేసిన సినిమాల్లో మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిన సినిమా ఇదే. బోయపాటిగారికి కథమీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటారు. మంచి ఎనర్జీ వున్న దర్శకుడు.
జయాపజయాలను ఎలా తీసుకుంటారు?
- సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ విషయం అనేది మన చేతిలో ఉండదు. సినిమా అనేది ఇష్టం కాబట్టి ప్యాషన్‌తో నటిస్తాను. నా వరకు నా పాత్ర బాగా చేశానా లేదా అనేది మాత్రం చూసుకుంటా.
తమిళంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు?
- ఇంతకుముందు చెప్పినట్టు తెలుగులో ఎగ్జైట్ కలిగించే పాత్రలు రావడం లేదు. కాబట్టి ఇక్కడ సినిమాలు చేయడం లేదు. తమిళంలో ఇలాంటివి చాలా వస్తున్నాయి. అందుకని అక్కడ చేస్తున్నాను.
మరి బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన ఉందా?
- ప్రస్తుతం నేను ఇక్కడ హ్యాపీగానే వున్నాను. తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి బాలీవుడ్‌కు వెళ్లాలనే ఆశ లేదు. నాకు సినిమాలే ముఖ్యంకానీ భాష కాదు.
రకుల్‌ప్రీత్‌సింగ్‌తో మీ కాంబినేషన్?
- ఈ సినిమాలో రకుల్‌కు నాకు మధ్య తక్కువ సీన్స్ ఉంటాయి. తను చాలా మంచి నటి. సినిమా పట్ల డెడికేషన్ ఉంది. తనతో పనిచేయడం హ్యాపీగా వుంది.
తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం తమిళంలో విశాల్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు ఆర్య హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో అయితే అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.

- శ్రీ