సుప్రీంతో మళ్లీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతి దర్శకత్వంలో సాయితేజ్ కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. వరుస ఫ్లాపుల తరువాత ఆమధ్య చేసిన ‘చిత్రలహరి’తో కాస్తంత ఊపిరి తీసుకున్న సాయితేజ్ -మారుతితో చేయబోయే ప్రాజెక్టు ప్రీప్రొడక్షన్స్ దశలో ఉంది. ప్రాజెక్టులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా రుక్షార్ థిల్లాన్‌ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. మరో పాత్రకోసం ఒకింత ఇమేజ్‌వున్న హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటే -ప్రాజెక్టు వాల్యూ పెరుగుతుందని మారుతి యోచిస్తున్నాడట. ఆ అవకాశం రాశీఖన్నాకు దక్కొచ్చని తెలుస్తోంది. ఇంతకుముందు ‘సుప్రీం’లో సాయితేజ్‌తో రాశీఖన్నా జోడీకట్టింది. వీళ్లిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో -సుప్రీంకు అదోక ప్లస్ అయ్యింది. సో, మరోసారి రాశీఖన్నాను సాయితేజ్ సరసన చూపించేందుకే మారుతి మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. సో, సాయితేజ్- రాశీఖన్నా జోడీ మరోసారి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే అవకాశం