నితిన్‌తో శ్రుతి కుదురుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీమంతుడు’ సక్సెస్ తరువాత నాగచైతన్యతో ‘ప్రేమమ్’ సినిమాలో నటిస్తోంది అందాలభామ శ్రుతిహాసన్. ప్రస్తుతం మరే సినిమా చేయడానికి ఆసక్తి చూపని ఆమె తాజాగా నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అ ఆ’ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమా మే 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన హీరోగా నటించే చిత్రానికి విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే శ్రుతిహాసన్‌తో చర్చలు కూడా జరుపుతున్నాడని తెలిసింది. నితిన్‌కు సక్సెస్ రేట్ ఎలా వున్నా కూడా క్రేజీ హీరోయిన్స్ అందరూ అతడితో జోడీ కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇలియానా, జెనీలియా, కాజల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లతో నటించాడు నితిన్. తాజాగా ఇపుడు శ్రుతితో జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.