నిజంగా.. స్పెషలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం -స్పెషల్. ఇదో మైండ్ రీడర్ లవ్ రివేంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి కారణమైన వాళ్లమీద మైండ్ రీడర్ రివేంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ఇది. అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థియేటర్లకు వచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ ‘సినిమా చూసిన వారంతా జెన్యూన్ అంటున్నారు. గత పదేళ్ళలో ఇలాంటి కథ, స్క్రీన్‌ప్లే చూడలేదన్న ప్రశంసలు దక్కుతున్నాయి. బడ్జెట్ కొరత కారణంగా టెక్నికల్ లోపాలు ఉండొచ్చు. కానీ కథ, కథనాన్ని మాత్రం తక్కువచేసి మాట్లాడలేరు. స్పెషల్‌ను వదిలేయొద్దు అన్నారు. బాపిరాజు మాట్లాడుతూ ‘విడుదలైన థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో, హీరోయిన్, అజయ్ అంతా బాగా చేశారు. మినిమం బడ్జెట్ అయినా ఎక్కువ క్వాలిటీతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది అన్నారు. హీరో రంగా మాట్లాడుతూ ‘స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లే. థియేటర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు. నాయిక అక్షత మాట్లాడుతూ ‘ఓ మంచి సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది’ అన్నారు.