టైటిల్ ట్వంటీటూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకుమార్ బి దర్శకత్వంలో మా ఆరుూ ప్రొడక్షన్స్‌పై రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా రూపొందనున్న చిత్రం-22. బ్యానర్ లోగో, టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. లోగోను నిర్మాత సి కల్యాణ్ ఆవిష్కరిస్తే, డైరెక్టర్ వివి వినాయక్ టైటిల్‌ను ప్రకటించాడు. కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు. వినాయక్ మాట్లాడుతూ ‘శివ నాదగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. సినిమాపై అంకితభావం చూపించే వ్యక్తికి దర్శకుడు చాన్స్ రావడం మంచి విషయం. 22 టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రాన్ని జూలై 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు. శివ పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. హీరో రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా, సంగీత దర్శకుడు సాయికార్తీక్, చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘కొత్త దర్శకుడు కొత్త కానె్సప్ట్‌తో రావడం హ్యాపీగా ఉంది. పరిశ్రమతో బాగా పరిచయాలున్న తండ్రి బిఎ రాజు మీద ఆధారపడకుండా, ప్యాషన్‌తో ఓ వెబ్ సిరీస్‌కి డైరెక్ట్ చేసి తన ప్రతిభ చూపించాడు. వెబ్ సిరీస్‌లోని హీరోనే హీరోగా పెట్టుకుని సినిమా తీయడం సామాన్య విషయంకాదు. 22 టైటిల్ ఇన్నోవేటివ్‌గా ఉంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నాడు. నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ ‘దర్శకురాలు దివంగత జయ ఎక్కడున్నా సంతోషించే రోజిది. శివ దర్శకుడు అవ్వాలని ఆమె కలలు కనేది. దర్శకుడికి ప్రొడక్షన్ మీద కంట్రోల్ ఉండటం చాలా అవసరం. శివ దగ్గర ఆ పనితనం ఉంది. తక్కువ టైమ్‌లో ఎక్కువగా మంచి సినిమాలు చెయ్యాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు శివకుమార్ మాట్లాడుతూ ‘మంచి దర్శకుల వద్ద చాలాకాలంపాటు ఆ విభాగంలో పనిచేశాను. అనుకోకుండా వచ్చిన ఓ అవకాశంతో రూపేష్‌కుమార్, సుశీలాదేవి నిర్మాతలుగా వెబ్ సిరీస్ చేశా. అదే ప్రొడక్షన్‌లో దర్శకుడిగా అవకాశం రావడం హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ, అగ్ర దర్శకుల ఆశీస్సులు, విజయం సాధించాలన్న సంకల్పంతో అడుగులేస్తున్నా. నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు అన్నారు.