రాగల 24 గంటల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యదేవ్, ఈషారెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్యపాత్రల్లో దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -రాగల 24 గంటల్లో. హీరో శ్రీరామ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. శ్రీ కార్తాకేయ సెల్యూలాయిడ్స్ సమర్పణంలో శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కానూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ్భగవాన్, యూనిట్ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం హీరో సత్యదేవ్ మాట్లాడుతూ -టైటిల్ చాలాసార్లు విన్నదే. వాతావరణానికి సంబంధించిన వివరాలు వెల్లడించేటపుడు ముందుమాట ఇదే వినిపిస్తుంది. అదెంత పాపులరో అందరికీ తెలిసిందే. అదే క్రేజీ టైటిల్‌తో ఓ ఆసక్తికరమైన కథను శ్రీనివాస్‌రెడ్డి తెరకెక్కించాడు. సస్పెన్స్‌థ్రిల్లర్‌గా సాకే కథ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకముంది అన్నారు. హీరోయిన్ ఈషారెబ్బా మాట్లాడుతూ -సినిమాలో నటనకు ఆస్కారమున్న ప్రాముఖ్యత కలిగిన పాత్ర చేశా. మంచి కథకు నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ పాత్రతో మరింత గుర్తింపు వస్తుందన్న నమ్మకముంది అని పేర్కొన్నారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ -కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను బాగా డీల్ చేసే శ్రీనివాస్‌రెడ్డి ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కించాడు. అలాగని ఇది పూర్తిగా సీరియస్ కాదు. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే, ప్రతి సన్నివేశంతో ఆకస్తి రేకెత్తిస్తుంది. కథకు కీలకమైన పాత్రలో కనిపిస్తా. ఆ పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. నిర్మాత కానూరు శ్రీనివాస్ మాట్లాడుతూ -ఈ కథ రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నం. ప్రతి నిమిషం ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. దాదాపుగా షూటింగ్ పూర్తవుతోంది, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ -వాతావరణానికి సంబంధించి.. రాగల 24 గంటలు అంటే ఏమిటో అందరికీ తెలుసు. అయితే సినిమాలో మాత్రం రాగల 24 గంటల్లో అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటన్నదే సినిమా. ఫన్‌ను మిస్ చేయకుండా తొలిసారి థ్రిల్లర్ చేస్తున్నా. సత్యదేవ్, ఈషా రెబ్బ చక్కగా చేసారు. శ్రీరామ్ కీరోల్‌లో కనిపిస్తాడు. జూలైలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామన్నారు.