వెనక్కి జరిగిన ఇస్మార్ట్ శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరల్డ్ కప్ సీజన్‌లో స్టార్ హీరోల సినిమాలూ వెలవెలపోక తప్పదు. ఇది గ్రహించే ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు జాగ్రత్తపడి, విడుదల విషయంలో ఒకింత వెనక్కి జరిగాడు. జోరున సాగుతోన్న క్రికెట్ సీజన్‌లో ధైర్యం చేసిన సినిమాను థియేటర్లకు తెస్తే ఓపెనింగ్స్ తగ్గుతాయన్న అంచనాల నేపథ్యంలో -ఇస్మార్ట్ శంకర్ విడుదలను వారం వెనక్కి జరిపినట్టు సమాచారం. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పూరి తెరకెక్కిస్తోన్న చిత్రం -ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన నిథి అగర్వాల్, నభానటేష్ కనిపించనున్నారు. జూలై 12న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, క్రికెట్ సీజన్‌లో సినిమా విడుదల చేస్తే ఓపెనింగ్స్ తగ్గే ప్రమాదముందన్న ఆలోచనతో జూలై 18కి విడుదలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో రామ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘మామా డేట్ ఛేంజ్ హువా.. కానీ గదే తోపు. ఛే దిన్ కే బాద్.. జూలై 18కీ కిరికిరి’ అంటూ ఇస్మార్ట్ శంకర్ లాంగ్వేజ్‌లో పోస్ట్ పెట్టాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌లో రామ్ స్టయిల్, డైలాగ్ డెలివరీతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడం తెలిసిందే. పూరి మార్క్ సినిమాని టేస్ట్ చేసి ఆడియన్స్‌కి చాలాకాలమైంది. ఇస్మార్ట్ శంకర్‌తో పూరి చూపుతోన్న వైవిధ్యంతో ప్రాజెక్టుపై భారీ అంచనాలే నెలకొన్నాయి.