సేన జైసేన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి సముద్ర దర్శకత్వంలో వి సాయిఅరుణ్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రం -జైసేన. సినిమాలో ‘సేన జైసేన.. యుద్ధం చెయ్’ అంటూ సాగే పాటను దర్శకుడు బి గోపాల్ తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సినిమా కానె్సప్టే వైవిధ్యంగా ఉంది. శ్రీకాంత్, సునీల్ మంచి పాత్రలు చేస్తున్నారు. సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు. నటుడు సనీల్ మాట్లాడుతూ ‘జైసేనలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నా. పాత్రపరంగా నేను సీరియస్‌గావున్నా ఆడియన్స్‌కి మాత్రం నవ్వొస్తుంటుంది. డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ. మంచి మెసెజ్‌తో వస్తోన్న సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. ప్రీతి శర్మ, నీతుగౌడ మాట్లాడుతూ -దర్శకుడు సముద్ర మంచి హ్యూమన్ బీయింగ్. సినిమాలో మంచి అవకాశాలిచ్చి ప్రోత్సహించడం పట్ల హ్యాపీగా ఉన్నాం’ అన్నారు. దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ ‘గురువు గోపాల్ చేతుల మీదుగా జైసైన సాంగ్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. మంచి సంగీతం సమకూర్చిన రవిశంకర్‌కి థాంక్స్. రాజకీయ నేతలు, యూత్‌ని కదిలించే చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.