ఉత్కంఠ రేపుతోన్న కల్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరో రాజశేఖర్‌ను పోలీస్ అవతారంలో చూపిస్తూ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం -కల్కి. సి కల్యాణ్ నిర్మాత. 28న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో సినిమా నుంచి ‘హానెస్ట్’ ట్రైలర్ విడుదల చేశారు. కొల్లాపూర్‌లో జరిగే అరాచకాలు, వాటిని నియంత్రించడానికి కల్కి అవతారంగా దిగే పోలీస్ ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ -సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్‌ను దట్టించి ట్రైలర్‌ను కట్ చేశారు. ‘హనుమంతుడు సాయమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే’నన్న డైలాగ్‌తో ట్రైలర్‌పై ఆసక్తి పెంచారు. నాజర్ డైలాగ్‌తో గొడ్డలి పట్టుకుని ఒక్కొక్కరిని రాజేశేఖర్ నరికే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివర్లో ‘చంపిందెవరో చెప్పాల్సింది నేను’ అని రాజశేఖర్ కోపంగా చెబుతున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. రాజశేఖర్ సరసన ఆదాశర్మ లీడ్ రోల్ చేస్తోంది. కల్కి హిట్టు ఖాయమన్న నమ్మకంతో చిత్రబృందం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ ‘ప్రవీణ్ సత్తార్, ప్రశాంత్ వర్మ.. ఇద్దరు సూపర్ డైరెక్టర్స్ నాతో ఉన్నారన్న ఫీలింగ్‌లో ఉన్నా. నిర్మాత సి కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ఉన్నారంటే అందుక్కారణం కల్కి. ‘గరుడవేగ’తో ప్రవీణ్ సత్తారు నాకో బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. ఆ లెవెల్‌ను క్రాస్ చేయాలన్న సంకల్పంతో చేసిన సినిమా ఇది. ఇదో డిఫరెంట్ ఫిల్మ్. కల్కి ఆడియన్స్‌కి పూర్తి సంతృప్తినిస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. కల్కి తరువాత గడరువేగ-2 చేస్తున్నా అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ గరుడవేగ చిత్రాన్ని మించి కల్కి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. టెక్నికల్ వాల్యూస్, హైబడ్జెట్‌తో తీసిన చిత్రమిది. టీజర్స్, ట్రైలర్‌తోనే మేకింగ్‌పై ఓ నమ్మకాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. రేయింబవళ్లు కష్టపడిన చిత్రబృందానికి అందుకు తగిన ప్రతిఫలం అందుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ -కల్కి మోషన్ పోస్టర్ విడుదలైన దగ్గర్నుంచి క్యూరియాసిటీ పెంచేసింది. టీజర్, కమర్షియల్ ట్రైలర్‌తో సినిమాలో ఏదో విషయం ఉందన్న అందరికీ అర్థమైంది. ఇప్పుడు హానెస్ట్ ట్రైలర్‌తో సినిమా పీక్స్‌కి చేరినట్టే. గరుడవేగ చిత్రంకంటే రెట్టింపు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందే హానెస్ట్ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. కమర్షియల్ ట్రైలర్ విడుదలైన తరువాత చాలామంది కల్కిని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో కంపేర్ చేయడం హ్యాపీగా ఉంది. 1983 నేపథ్యంలో సాగే ఈ కథ ఇనె్వస్టిగేషన్ థ్రిల్లర్‌లా సాగుతుంది. భారీ, డేంజరస్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. సినిమా విడుదల తరువాత అంతా కల్కి-2 కోసం ఎదురు చూస్తారు అన్నాడు. కార్యక్రమంలో కృష్ణచైతన్య, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు మాట్లాడారు.