గ్యారేజ్‌లో ఐటెంసాంగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అల్లుడు శీను’ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించి ఔరా అనిపించింది అందాల భామ తమన్నా. ఓవైపు క్రేజీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు సెలెక్టివ్‌గా ప్రత్యేక పాటల్లో నర్తిస్తోంది. మరోసారి ‘స్పీడున్నోడు’ చిత్రంలో కూడా ప్రత్యేక పాటలో మెరిసిన తమన్నా మరోసారి ఈ తరహా పాటల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ఓ ప్రత్యేక మాస్ సాంగ్ వుందని తెలిసింది. ఈ పాటలో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న తమన్నా అయితే బావుంటుందని ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే తమన్నాతో దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది. తమన్నా ఇదివరకే ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’ చిత్రంలో నటించింది.