మణిరత్నం సినిమాలో తెలుగమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా అంటేనే అదో అద్భుత దృశ్యకావ్యంలా వుంటుంది. ఆయన సినిమాలో ఛాన్స్ రావడమంటే గొప్ప విషయమే. ఇప్పుడు అలాంటి ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్ గ్లామర్ భామ అతిథిరావ్ హైదరి. ‘ఓకె బంగారం’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం తాజాగా రూపొందించే చిత్రంలో కార్తి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం అతిథిరావ్ హైదరీని అడిగారట. మొదట్లో మలయాళంలో రూపొందిన ‘ప్రేమమ్’ చిత్రంలో నటించిన సాయి పల్లవిని హీరోయిన్‌గా అడిగారట. కానీ ఆమె పాత్రకు సరిపోదని పలువురి హీరోయిన్లను పరిశీలిస్తున్న మణిరత్నానికి అతిథిరావు హైదరీ అయితే బాగుంటుందని ఆమెని ఎంపిక చేశాడట. అతిథి తెలుగమ్మాయి అయినా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ భామగా అందాలు ఆరబోసినా ఈమెకు సరైన కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. మొత్తానికి మణిరత్నం లాంటి దర్శకుడి చేతిలో పడడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా మొదలుకానుందట.