సరైనోడు సమాధానమిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘సరైనోడు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈమధ్యకాలంలో వచ్చిన మోస్ట్ స్టైలిష్డ్ సినిమా ఇదే అవుతుందని, బాలీవుడ్‌కి ధీటుగా అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన సినిమాలు తెలుగులో రావడంలేదనుకున్నవాళ్లకు ‘సరైనోడు’ సమాధానమిస్తాడని అన్నారు. ఈ సినిమా ఇంత స్టైలిష్‌గా రావడానికి సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి ప్రతిభే కారణమని, అలాగే టెక్నీషియన్లు అందరూ కష్టపడి పనిచేశారని, ఈనెల 22న భారీగా విడుదల చేస్తామన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, తాను హీరోలందరితో సినిమాలు చేయాలని వచ్చానని, ఏ హీరోకు ఏ కథ సూట్ అవుతుందో ఆలోచించి సినిమా చేస్తానని, ఖచ్చితంగా పండగలాంటి చిత్రం. అల్లు అరవింద్‌లాంటి నిర్మాత లేకుండా ఇంత భారీ చిత్రాన్ని చేయలేమని, అన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ, సినిమాలో యాక్షన్‌తోపాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఆది మాట్లాడుతూ, ఊరమాస్ ఓపెనింగ్స్‌తో సినిమా రాబోతోందని, ఇందులో తాను ఎందుకు విలన్‌గా చేశానో సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు.