ఏలియన్ లవ్‌లో పడితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగ్రహానికి దిగొచ్చిన ఏలియన్ -భూమీది కుర్రాడి పేమలో పడితే? ఫిక్షనల్ కానె్సప్ట్‌తో తిలక్, సుష్మా హీరోహీరోయిన్లుగా దర్శకుడు లెన్లీ తెరకెక్కించిన చిత్రం -ఒక ఏలియన్ ప్రేమ కథ. మయా మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రాన్ని తెలుగులో పిఆర్‌కె ఫిలిమ్స్ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఆవిష్కరించిన సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పాటలు, ట్రైలర్ బావుంది. జగదేకవీరుడు అతిలోక సుందరిలో భూలోకానికి వచ్చిన దేవకన్య శ్రీదేవి మానవుడిని ప్రేమించినట్టు.. భూమీదికొచ్చిన ఏలియన్ ఆర్మీ సోల్జర్‌ను ప్రేమించడమనే కానె్సప్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సరికొత్త కానె్సప్ట్‌తో పరిశ్రమకు పరిచయమవుతున్న నిర్మాత ఉమేష్‌ను ప్రోత్సహించాలి అన్నారు. నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ -సదరన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంజనీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను, తెలుగులో సినిమా చేయాలనే తపనతోనే వచ్చానన్నారు. సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్టులో విడుదల చేస్తామన్నారు. సినిమా లైన్ చెబుతూ -ప్రేమ అనే ఆయుధాన్ని వెతుక్కుంటూ ఓ గ్రహాంతరవాసి (హీరోయిన్) భూగ్రహానికి చేరినపుడు, ప్రేమ ఆయుధం కాదు అనుభూతి అని హీరో ఎలా తెలియజేశాడన్నదే కానె్సప్ట్. ఎంటర్‌టైన్‌మెంట్‌పరంగా ఆడియన్స్‌ని కచ్చితంగా సంతృప్తిపర్చే చిత్రమిది అన్నారు.