కథ నచ్చింది.. దొరసానినయ్యాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె
శివాత్మికను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం -దొరసాని. విజయ్
దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో. కెవిఆర్ మహేంద్ర దర్శకుడు.
ఈ పీరియాడికల్ సినిమా 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తొలిసారి మీడియాతో తన అనుభవాలను ముచ్చటించింది శివాత్మిక రాజశేఖర్.
హీరోయిన్‌గా అక్కకంటే ముందే వస్తున్నా. ఇది ఊహించింది కాదు. నిజానికి అక్క హీరోయిన్‌గా చాలారోజుల క్రితమే సినిమా మొదలైంది. అనూహ్యంగా నా సినిమా ముందు విడుదలవుతోంది.
నాన్న హీరో కనుక -ఆయన ప్రభావం మాపై ఉంది. ఫీల్డ్‌కు రావాలన్న ఆశ, ఆలోచన చిన్నప్పటినుంచే అక్కకూ, నాకూ ఉంది. ఈ విషయాన్ని అమ్మకు చెప్పిన ప్రతిసారీ -ముందు చదువు. ఆ తరువాతే ఏదైనా. చూద్దాంలే అనేది.
దొరసాని ప్రాజెక్టు -అనుకోకుండా కుదిరిందనాలి. పద్దెనిమిదేళ్ల తరువాత నటనలో శిక్షణ తీసుకోవాలనుకున్నా. అయితే, మధుర శ్రీ్ధర్ ఒకసారి దొరసాని కథ వినమన్నారు. దర్శకుడు మహేంద్ర ఈ కథను నేరేట్ చేశాడు. ఒకవేళ కథ నచ్చకపోయివుంటే నటనలో శిక్షణ తీసుకునేదాన్ని. కానీ కథ నచ్చింది. వెంటనే చేద్దామనిపించింది. ఇలాంటి మంచి స్క్రిప్ట్ ఎప్పుడోగాని రాదని అమ్మ కూడా చెప్పడంతో -ప్రాజెక్టు మొదలైంది. తొలి సినిమాకే మంచి స్క్రిప్ట్ రావడంతో వదులుకోలేదు.
మోడ్రన్ లుక్స్‌లోనే పరిచయం కావాలన్న ఆలోచనలు నాకు అస్సలు లేవు. పీరియాడికల్ స్టోరీ కనుక, హీరోయిన్ ట్రెడిషినల్‌గా ఉంటుంది. ఈ కథకు నేను సూటవుతాననే నన్ను ఎంచుకున్నారు. కాబట్టి పాత్రకు న్యాయం చేయడానికి నా ప్రయత్నం చేశా.
సినిమా మొత్తంమీద నాకు పది పదిహేను డైలాగులు కూడా ఉండవు. దాదాపుగా సినిమా అంతా కళ్లతోనే భావం పలికించాలి. నైజాంల కాలంలో గడీల పాలన ఉండేది. అందులో ఓ దొర కూతుర్ని నేను. బయటి ప్రపంచం తెలీని అమ్మాయిని. అలాంటి అమ్మాయిని ఊళ్లోని రాజు అనే కుర్రాడు ప్రేమిస్తే -ఎలాంటి పరిణామాలు తలెత్తాయన్నది అసలు కథ. రియలిస్టిక్‌గా వుంటుంది.
ఆనంద్ మంచి నటుడు. సినిమాలో నాకంటే ముందు తనే ఓకే అయ్యాడు. చాలామంది విజయ్ దేవరకొండతో పోలుస్తున్నారు. కానీ ఆనంద్ స్టైల్ ఆనంద్‌దే.
నా పెర్ఫార్మెన్స్‌పై అమ్మానాన్నల ఇంపాక్ట్ ఉండొచ్చు. జీన్స్ కనుక దగ్గరి పోలికలూ కనిపించొచ్చు. నేను అమ్మలా ఉంటానంటారు. పద్దెనిమిదేళ్ల వయసులో అమ్మ ఇలానే ఉండేదేమో.
నా దృష్టిలో వారసత్వం ఆనందించాల్సిన విషయం. అక్కడ కష్టాలు ఉండవని అనను, కాకపోతే పరిచయం సులువవుతుంది. ఏరంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే కష్టపడటం ఒక్కటే మార్గం.
నా పేరెంట్స్ ఇంకా ఫైనల్ కాపీ చూళ్లేదు. అమ్మ డబ్బింగ్ టైంలో చూసి బాగుందని మెచ్చుకుందంతే. నాన్నయితే సినిమా కథ కూడా వినలేదు.
ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు.
నాన్న హీరోగా ఉండగానే కూతురు హీరోయిన్ కావడం హ్యాపీగా ఉంది. నాన్న హీరోగా సక్సెస్‌లు అందుకుంటున్నారు. నేను ఆయనకు బిగ్ ఫ్యాన్.
దొరసాని విడుదల కోసం చూస్తున్నా. దీని తరువాత రెండు మూడు ఆఫర్లు ఉన్నాయి.