మా ఊరి ప్రేమకథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంజునాధ్ హీరోగా, శరణం గచ్ఛామి ఫేం తనిష్క తివారి హీరోయిన్‌గా శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై మంజునాధ్ దర్శకత్వంలో లక్ష్మిదేవి, మహేంద్రనాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం మా ఊరి ప్రేమకథ. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డిఐ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు లక్ష్మీదేవి, మహేంద్రనాథ్ మాట్లాడుతూ- కథ, కథనాలు ఆకట్టుకుంటాయి. సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. చిత్రంలో ఐదు పాటలు వుంటాయి. త్వరలో సెన్సార్ పూర్తిచేసి ఆగస్టులో చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. హీరో, దర్శకుడు మంజునాధ్ మాట్లాడుతూ- రియలిస్టిక్ అంశాలతో గ్రామీణ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాం. దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నానన్నారు.