కల్యాణ్‌రామ్‌తో అతిథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది మిస్ ఇండియాగా ఎంపికైన ప్రముఖ దిల్లీ మోడల్ అతిథి ఆర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. గత ఏడాది ‘పటాస్’తో కమర్షియల్ విజయాన్ని అందుకున్న కల్యాణ్‌రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తికావచ్చిందని చెబుతున్నారు. హీరోగా నటిస్తూనే కల్యాణ్‌రామ్ నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అతిథి ఆర్య నటిస్తుందని తెలిసింది. ఇటీవలే ఆమెపై ఫొటో షూట్ కూడా చేశారని, ఈ పాత్రకు ఈమె కరెక్ట్ అనే ఉద్దేశ్యంలో ఉన్నారట దర్శకుడు. వచ్చే నెలలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమాలో ఛాన్స్ రావడంపై ఈ భామ చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పూరి మార్క్ స్టైల్లో తెరకెక్కే ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ జర్నలిస్టు పాత్రలో కన్పిస్తాడట.