దొరసాని నచ్చుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘దొరసాని’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకు హైదరాబాద్‌లో జరిగింది. విజయ్ దేవరకొండ, రాజశేఖర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ- తమ్ముడు సినిమా చేస్తానని అన్నపుడు నటించడమంటే మాటలు కాదు, చాలా కష్టం.. అయినా అమెరికాలో మంచి జాబ్ వదిలేసి రావడం అవసరమా అని చెప్పాను. కానీ తన పాషన్ సినిమా అని తెలుసుకున్నాను. తను అమెరికాలో జాబ్ చేస్తూ మమ్మల్ని పోషించాడు. ఆనంద్ లేకుంటే ఇంకెన్ని కష్టాలు పడేవాడినో. తను చేసిన సాయం ఇవాళ నేను ఈ స్థాయిలో వున్నందుకు ఉపయోగపడింది. దర్శకుడు మహేంద్ర చెప్పిన కథ నచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చేలా వుంటుంది. అలాగే శివాత్మిక అద్భుతంగా నటించింది. తప్పకుండా మీ అందరికీ ఈ దొరసాని నచ్చుతుంది అన్నారు. దర్శకుడు మహేంద్ర మాట్లాడుతూ నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్ తరువాత చాలా మాట్లాడాలని ఉంది. ఈ కథ నేను దాచుకోలేని ఓ ఎమోషన్. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రాజెక్టు వుంటుంది. అది సినిమాలు చేస్తూ చేసుకునేవాళ్లుంటారు. కానీ అదృష్టవశాత్తూ అది నాకు మొదటి సినిమాగా మారింది. ఇందులో హానెస్ట్, రియాలిటీ, పీరియాడిక్, ప్రాపర్ డైలాగ్స్, ప్రెష్‌నెస్ వుంటాయి. ఈ పాత్రలకోసం ఆనంద్, శివాత్మికలు దొరకడం నా అదృష్టం. మధుర శ్రీ్ధర్ ప్రతి విషయంలో నాకు సపోర్టు అందించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ- విజయ్ నుంచి నేను ఒకటి నేర్చుకున్నా. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ నెర్వెస్‌గానే అనిపిస్తుంది, ఇంకా టెన్షన్‌గా వుంటుంది. కానీ ఇప్పటికీ నాకెందుకు టెన్షన్ అనే విషయం విజయ్‌ను చూస్తే అనిపిస్తుంది. మా ఇద్దరి పిల్లలకు సినిమాల్లో రావడం కోరిక. వాళ్లకోసం ప్రపంచ స్థాయి స్కూల్‌ను స్థాపించా. మేం ఎక్కడెళితే అక్కడికి పిల్లలను తీసుకెళ్లేవాళ్లం. అక్కడే టీచర్లను పెట్టి చదివించేవాళ్లం. నిజంగా సినిమాల్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ సక్సెస్ లేకపోతే పరిస్థితి వేరేలా వుంటుంది. ఈ సినిమాతో శివాత్మిక మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది అన్నారు.