ఏడు గెటప్పులే ఆ సినిమా స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ హీరోయిన్ సమంత ముఖ్యపాత్రలో, సీనియర్ నటి లక్ష్మి, నాగశౌర్య, రావురమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బివి నందిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -ఓ బేబి. జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ హ్యాపీమూడ్‌లో హీరో నాగశౌర్య మీడియాతో ముచ్చటించాడు.

ఓ బేబీ సక్సెస్ ఊహించిందే. మంచి సినిమాలో భాగస్వామి కావడం హ్యాపీగా ఉంది. చాలాకాలంగా సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మితో నటించాలన్న కోరిక, ఈ సినిమాతో నెరవేరింది. సమంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. సెట్స్‌లో ఆమె పనితనం చూసి షాకయ్యేవాడిని. ఆమెతో పోటీపడి నటించాల్సి వచ్చింది.
కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్ని అవాయిడ్ చేసినట్టు వస్తోన్న వార్తలు నిజం. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ.
దర్శకురాలు నందినిరెడ్డితో నాకు అక్కతో ఉండే అనుబంధం. ఓ బేబీని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.
ప్రస్తుతం నేను చేస్తున్న అశ్వత్థామ రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. అలాగే అవసరాల శ్రీనివాస్‌తో ‘్ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ ప్రాజెక్టులోనూ రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఇందులో నేను ఏడు గెటప్పుల్లో కనిపిస్తా. అదే ఈ సినిమాకు మెయిన్ పాయింట్. ఇదికాకుండా పార్థు అనే మరో సినిమా చేస్తున్నా.